మంగు మచ్చలను పోగొట్టడానికి జాజికాయ..!

Divya
సాధారణంగా మొటిమలతో వచ్చిన మచ్చలు అయితే వారం పది రోజుల్లోగా క్రమంగా తగ్గుముఖం పడతాయి. కానీ మంగు మచ్చలుగా మాత్రం ఎటువంటి క్రీములు వాడినా,ఎంతటి చికిత్స చేసుకున్న అవి అసలు వదలవు.అంతేకాక అవి ఒకచోట మొదలయ్యి మొత్తం ముఖమంతా వ్యాపించి,మొఖాన్ని అందవిహీనంగా తయారు చేస్తాయి.అటువంటి వారి కోసం జాజికాయతో చేసే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అటువంటి జాజికాయతో ఎలా ఉపయోగించాలో,మంగు మచ్చలను ఎలా తరిమి కొట్టాలో మనము తెలుసుకుందాం పదండి..
సాధారణంగా మంగు మచ్చలు ముఖంపై సూర్యరశ్మి పడడంతో,అలర్జీ వచ్చి మంగు మచ్చలు వస్తాయి మరియు హార్మోనల్ ఇన్ బాలన్స్ వల్ల కూడా ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున ముందు నుంచే సున్నితమైన చర్మం కలవారు సూర్యరశ్మిలోకి అంటే ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం,స్కార్ఫ్ కట్టుకోవడం లేదా గొడుగు క్యారీ చేయడం వంటివి చేయడం ఉత్తమం.మరియు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ తో మంగు మచ్చలు వచ్చేటట్టు అయితే హార్మోనల్ ని సెట్ చేసుకోవడం కూడా మన బాధ్యతే.
ఈ చిట్కా కోసం ముందుగా మంగు మచ్చలను పోగొట్టుకోవాలంటే ముఖంపై ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా రోజుకు రెండు నుంచి మూడుసార్లు మొహం బాగా కడుక్కోవాలి.ఆ తరువాత ఒక జాజికాయ తీసుకొని,అరుగురాయిపై తేనె వేసి జాజికాయను అరగదీయాలి.ఇలా అరగదీస్తున్నప్పుడే దానికి తోడుగా ఒక్కొక్క చుక్క రోజ్ వాటర్ వేస్తూ అరగదీసి,మంగు మచ్చలపై రాయాలి.
ఇలా దానిని అరగంటసేపు ఆరనిచ్చిన తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.మరియు ఆయిల్ ఫ్రీగా ఉన్న  మాయిశ్చరైజర్ కానీ,సన్ స్క్రీన్ కానీ రాయడం చాలా ఉత్తమం.ఇలా మీరు కూడా ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే జాజికాయను తెచ్చి ఇలా చేసి చూడండి.మరియు వీటితో పాటు చర్మం డిహైడెడ్ గురికాకుండా తగినంత నీరు తీసుకోవడం,నీటి శాతం అధికంగా ఉన్న ఫ్రూట్స్ మరియు కూరగాయలు తినడం కూడా చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: