సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఈ వృద్ధాప్య సంకేతాలు ఖచ్చితంగా మన అందాన్ని పాడుచేస్తాయి. కాబట్టి చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి, చాలా మంది కూడా ఫేషియల్స్, బోటాక్స్ వంటివి ఎక్కువగా చేస్తుంటారు.కానీ అవి చర్మానికి మాత్రం అంతగా ఉపయోగపడవు. కేవలం సమతుల్య ఆహారం, ఆర్ద్రీకరణ, ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే చర్మం వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. ఇప్పుడు వయసు పెరిగినా కూడా ముడతలు పడిన చర్మం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.సమతుల్య ఆహారంలో తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉండాలి. వీటిని రోజూ వారి ఆహారంలో తింటే చర్మ సౌందర్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.మన చర్మంపై ముడతలు నివారించే పండ్లు ఇవే.. బ్లూబెర్రీ చర్మ సంరక్షణకు మంచి సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్లు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో చాలా ఈజీగా పోరాడుతుంది.
ఇక ధర ఎక్కువైనా కూడా ప్రతి రోజూ ఆవకాడో తినాల్సిందే. ఈ పండులో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి ఈజీగా రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.ఈ అవకాడో తినడం వల్ల చర్మం ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.అలాగే ఎండ నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. సన్‌స్క్రీన్‌తో పాటు, దానిమ్మ పండ్లు కూడా ఎక్కువగా తినాలి. దానిమ్మ చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఇంకా ఎన్నో చర్మ సమస్యలను కూడా ఈజీగా నివారిస్తుంది.అలాగే పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా విధాలుగా సంరక్షిస్తాయి. ఈ పండు తినడంతో పాటు పండు గుజ్జుని చర్మంపై రాసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక పండిన బొప్పాయి చర్మంపై సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది రంధ్రాల్లో పేరుకుపోయిన మృత కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.