నెరిసిన జుట్టు నల్లగా మెరిసే సూపర్ టిప్?

frame నెరిసిన జుట్టు నల్లగా మెరిసే సూపర్ టిప్?

Purushottham Vinay
చాలా మందికి కూడా చిన్న తనం నుంచే జుట్టు తెల్లబడి పోతుంది. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్ధులుని అయితే ఎక్కువగా ఈ సమస్య వెంటాడుతుంది.వెంట్రుకలు తెల్లగా మారడం వల్ల వారు నలుగురిలో కలవలేక చాలా ఇబ్బందిపడిపోతుంటారు. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి వంటి చాలా కారణాల వల్ల చాలామందికి జుట్టు నెరుస్తుంటుంది. ఇంకా అలాగే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి చాలా మంది జుట్టుకు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ కలర్స్‌ ఉపయోగిస్తుంటారు. కానీ అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ సమస్యకు దీర్ఘకాల ఉపశమనం కలిగించాలంటే ఖచ్చితంగా ఉసిరి కాయను వినియోగించాలి. ఉసిరికాయ జుట్టు సంబంధిత సమస్యలకు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడే లక్షణాలు ఉసిరికాయల్లో చాలా పుష్కలంగా ఉంటాయి.ఉసిరిలో మెలనిన్ పిగ్మెంట్‌ను పెంచడంలో సహాయపడే చాలా పోషకాలు ఉంటాయి. ఈ మెలనిన్ అనేది మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఉసిరిలో జింక్, విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ జుట్టును సహజ పద్ధతుల్లో అందంగా ఇంకా నల్లగా మారుస్తుంది.


ఇంకా అంతేకాకుండా ఇది ఇతర జుట్టు సంబంధిత సమస్యలను కూడా చాలా ఈజీగా దూరం చేస్తుంది. ఇక ఉసిరి చుండ్రును తొలగిస్తుంది. అలాగే రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.ఇక జుట్టు సంబంధిత సమస్యల నివారణ కోసం ఉసిరిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది, ఉసిరి రసంని త్రాగవచ్చు. లేదంటే ఈ ఉసిరితో స్వీట్స్‌ తయారు చేసి తినవచ్చు. ఇక రెండవ మార్గం ఏంటంటే.. జుట్టుకు ఉసిరి రసాన్ని రాయాలి. ఇది మీ జుట్టును చాలా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల జుట్టుకు చాలా రకాలుగా మేలు జరుగుతుంది. అలాగే ఉసిరికాయ మీ జుట్టుకు ఇతర మేలు కూడా చేస్తుంది. ఉసిరి మీ జుట్టును బలంగా, మృదువుగా, సిల్కీగా మార్చడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా చాలా మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. ఉసిరి ఈ సమస్యను ఈజీగా నివారిస్తుంది. ఉసిరి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: