ప్రస్తుత కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్నవయసులోనే అందరికి వచ్చేస్తుంది. ఒకప్పుడు 50 ఏళ్ళు దాటితే కానీ రాని ఈ సమస్య ఇప్పుడు మాత్రం 30 ఏళ్ల లోపే వచ్చేస్తుంది.పైగా ఈ రోజుల్లో కెమికల్స్ తో కూడిన షాంపులు చాలా ఎక్కువైపోతున్నాయి. అది కూడా ఈ సమస్యకి ప్రధాన కారణం.అలా చిన్న వయసులో ఈ సమస్య రావడం వల్ల చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ని కూడా వాడేస్తూ ఉంటారు..అయితే అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని పదార్ధాలని వాడి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇంకా అలాగే వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ప్లాస్టిక్ లేదా చెక్క లేదా స్టీల్ గిన్నెలో ఒక స్పూన్ హెన్నా పొడి, అర స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ బ్రహ్మీ పొడి,ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ పుదీనా పొడి, ఒక స్పూన్ వెనిగర్ ఇంకా అలాగే సరిపడా నీటిని పోసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసే కలుపుకోవాలి.
ఇక ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల దాకా బాగా పట్టించి ఒక గంట తర్వాత సాధారణమైన నీటితో జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మరుసటి రోజు కుంకుడు కాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా మంచి పలితం ఉంటుంది. ఇక తెల్లజుట్టు సమస్య ప్రారంభం కాగానే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఖచ్చితంగా చాలా మంచి పలితాలను పొందవచ్చు. ఇంకా అలాగే ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా విముక్తి పొందండి.ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా వారం రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా ఈజీగా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజు ఈ టిప్ పాటించండి.