డాన్డ్రఫ్ ని ఈజీగా తరిమికొట్టే టిప్స్ ?

Purushottham Vinay
మనలో చాలా మంది కూడా ఎక్కువగా చుండ్రు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల షాంపూలు, నూనెలను వాడతారు. కానీ ఎంత వాడినా కానీ చుండ్రు సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా చుండ్రు సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు.రోజ్మేరీ, థైమ్ లేదా సేజ్ వంటి మూలికలను నీటిలో ఉడకబెట్టడం వలన హెర్బల్ రిన్స్‌ తయారవుతుంది. ఈ మిశ్రమం చల్లారాక దాన్ని వడకట్టి, షాంపూ చేసిన తర్వాత చివరిగా బాగా శుభ్రం చేసుకోండి.ఇక ఈ మూలికలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి జుట్టును బాగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.అలాగే తాజా కలబంద జెల్‌ను నేరుగా మీ తలకు అప్లై చేసి ఒక 20-30నిమిషాలు అలాగే ఉంచండి. దీని కూలింగ్, హైడ్రేటింగ్ ఎఫెక్ట్స్ స్కాల్ప్‌ ఉపశమనానికి ఇంకా చుండ్రును తగ్గించడానికి సహాయపడతాయి.అలాగే వేప పొడి, ఉసిరితో పేస్ట్‌ను తయారు చేసి దానిని నీరు లేదా అలోవెరా జెల్‌తో కలిపి స్కాల్ప్‌కు అప్లై చేయండి.


ఒక 30నిమిషాల పాటు అలాగే ఉంచి తల స్నానం చేయండి. వేప, ఉసిరిలో ఉన్న యాంటీమైక్రోబయిల్ లక్షణాల వలన ఈ మిశ్రమం చుండ్రుతో పోరాడటమే కాకుండా జుట్టుకు మంచి పోషణనిస్తుంది.అలాగే మెంతి గింజలను తీసుకొని వాటిని రాత్రంతా నానబెట్టి, వాటిని పేస్ట్‌లా చేసి తలకు బాగా పట్టించండి. ఈ పేస్ట్ చుండ్రు వలన కలిగే పొడి, దురదను ఈజీగా తగ్గిస్తుంది. అందువల్ల చుండ్రు సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.అలాగే వేడి ఆయిల్ మసాజ్‌తో చుండ్రును దూరం చేయవచ్చని ఆయుర్వేదం అంటుంది. చలికాలంలో స్కాల్ప్, వెంట్రుకలను పోషించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. టీ ట్రీ లేదా వేప వంటి నూనెలతో వెచ్చని కొబ్బరి నూనె ఇంకా నువ్వుల నూనె లేదా రెండింటినీ కలిపి బాగా మసాజ్ చేయండి. అలా చేయడం వలన స్కాల్ప్‌పై తేమను పెంచడమే కాకుండా రక్త ప్రసరణను కూడా బాగా మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: