మి పెదాలు అందంగా కనిపించాలా...?
ముఖ్యంగా పెదవులు నల్లగా మారడానికి శరీరం డిహైడ్రేషన్ కి గురి కావడం,పెదవులపై మృతకణాలు పేరుకుపోవడం,బీడీ సిగరెట్లు వంటివి హాని కలిగించడం, స్కిన్ ఎక్స్ప్లలేషన్ ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి.ఇలాంటి వాటికి అన్నిటికీ టమాటాతో చేసే చిట్కా చెక్ పెడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.మరి ఆ చిట్కా ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
దీనికోసం ముందుగా ఒక పండిన టమోటాను సగానికి కట్ చేసి తీసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ అలోవెరా గుజ్జు,ఒక స్పూన్ చక్కెర, రెండు చిటికలంతా కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని టమోటాతో అద్దుతూ పెదవులపై మెల్లగా మర్దన చేయాలి.ఇలా పది నుంచి 15 నిమిషాల పాటు పెదవులను స్క్రబ్ చేస్తూ ఉండటం వల్ల పెదవులపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి.దీనిని రెండు నుంచి మూడు వారాలపాటు క్రమంగా చేయడం వల్ల పెదవులు గులాబీ రంగును సంతరించుకుంటాయి.ఈ చిట్కా వాడిన తర్వాత మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి.లేదా విటమిన్ ఈ కలిగిన ఆయిల్ అప్లై చేయడం ద్వారా కూడా పెదవులు మృదువుగా,ఎర్రగా మారుతాయి.
మరియు దీనితోపాటు తగిన మోతాదులో నీటిని తీసుకోవడం,లిప్ బామ్,లిప్స్టిక్ వంటి ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ వాడడం,ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం,కాఫీ,టీ లలోని కెఫెన్ అధికంగా ఉంటుంది,కనుక వీటిని కూడా దూరంగా ఉంచడం,బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ తో కవర్ చేయడం వంటివి చేయడం వల్ల పెదవులు గులాబీ రంగులో ఉంటాయి.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.