మచ్చలు, మొటిమలు తగ్గే సూపర్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.రోజుకు రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా మంది మాత్రమే చేస్తుంటారు. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఒక సారి అయితే, నైట్ పడుకునే ముందు రెండవ సారి. అయితే ముఖంపై మొటిమలు రావడానికి ఇలా రెండుసార్లు ముఖం కడుక్కోవడం కూడా ఓ కారణం కావచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవడమే కాకుండా తప్పకుండా చెమట ఎక్కువగా వచ్చినప్పుడు అంత కంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ ఖచ్చితంగా చేసుకోవాలి. అందువల్ల ముఖంపై దుమ్ము, జిడ్డు ఈజీగా తొలగిపోయి చర్మ రంధ్రాలనేవి మూసుకుపోకుండా ఉంటాయి. అలాగే మొటిమలు కూడా ఏర్పడవు. అయితే ఈ క్రమంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమిటంటే కేవలం చర్మ తత్వానికి సరిపడే క్రీములను మాత్రమే ఫేస్ వాష్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి.
చాలా మందికి కూడా పదే పదే ముఖానికి చేతులను తాకించే అలవాటు ఉంటుంది. ఫలితంగా చేతులకు ఉన్న క్రిములు ముఖంపైకి చేరి మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి ముఖం కడుక్కునేటప్పుడు తప్ప మిగతా సమయంలో వీలైనంత వరకు చేతులను ముఖానికి తాకించకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొరపాటున ముఖంపై చేతులు టచ్ చేసిన ఎటువంటి బ్యాక్టీరియా ఫేస్ పైకి చేరదు. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.మనం ఎక్కువగా మొబైల్స్, ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని అంతగా పట్టించుకోము. కానీ వాటిపై చేరే బ్యాక్టీరియా చేతికి అంటుకుని అది ముఖం స్క్రీన్ పైకి చేరుతుంది . ఇలా కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని అధ్యయనాల్లో అయితే పబ్లిక్ టాయిలెట్ కంటే మొబైల్ స్క్రీన్‌పై ఎక్కువ అపరిశుభ్రత ఉంటుందని తేలింది. కాబట్టి ఫోన్ స్క్రీన్‌తో పాటు ఇతర గార్జెట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.