జుట్టు పొడవుగా, మందంగా పెరగాలంటే ఈ రహస్యం తెలుసుకోండి!

frame జుట్టు పొడవుగా, మందంగా పెరగాలంటే ఈ రహస్యం తెలుసుకోండి!

Purushottham Vinay
జుట్టు పొడవుగా, మందంగా పెరగాలంటే ఈ రహస్యం తెలుసుకోండి!                                           

 జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా పెరగాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. ఇప్పట్లో అలాంటి జుట్టు చాలా తక్కువ మందికి ఉంటోంది. ముఖ్యంగా గత 20,30 ఏళ్ల క్రితం ఆడవాళ్లకు చాలా పొడవుగా, మందంగా  జుట్టు ఉండేది.ఇప్పుడు ఎన్ని రకాల ప్రోడక్ట్స్, ఆయిల్ వాడినా జుట్టు పెరగడం లేదు. దీనికి కారణం అనేక రకమైన ప్రోడక్స్ట్ లోని రసాయనాలే అని జుట్టు సంరక్షణ నిపుణులు చెబుతున్నారు . జుట్టు మందంగా, పొడవుగా పెరగాలంటే ఆయుర్వేద సూచనలు పాటించాలి. కేవలం ఒకే ఒక్క పౌడర్ వాడితే చాలు.. జుట్టు బాగా మందంగా, పొడవుగా పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అదేంటో తెలుసుకుంటే..అతిమధురం..ఆయుర్వేదంలో అతిమధురం ఒక గొప్ప మూలిక. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అతిమధురం పొడిని వాడితే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా సరే తిరిగి మందంగా మారుతుందట.


ఇందుకోసం అతిమధురం పొడిని కింది విధంగా ఉపయోగించాలి. హెన్నాతో..అతిమధురం పొడిని హెన్నాతో కలిపి జుట్టుకు పెట్టుకోవచ్చు . దీనికోసం కావలసిన పదార్థాలు..హెన్నా పౌడర్..టీ డికాక్షన్..అతిమధురం పొడి.. 4 స్పూన్లునీరు.. అవసరాన్ని బట్టిపెరుగు.. 2స్పూన్లు.తయారు చేసే విధానం..హెన్నా పౌడర్ లో కాస్త టీ డికాక్షన్, అతిమధురం పొడి, నీరు, పెరుగు అన్ని వేసి బాగా కలిపి పేస్ట్ లాగ చేసుకోవాలి. దీన్ని  ఒక గంట సేపు పక్కన పెట్టాలి. కావాలంటే రాత్రి మొత్తం అలాగే ఉంచినా కానీ ఎం కాదు .గంట తరువాత హెన్నా పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని 30నిమిషాలు పాటు అలాగే ఉంచుకోవాలి.30 నిమిషాల తరువాత షాంపూతో కాకుండా నీటితో మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి. కేవలం  ఇది ఒక్కసారి వాడటంతోనే దీంతో ఫలితాలు కనిపిస్తాయి. దీన్ని నెలకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.ఇది వాడడం వాళ్ళ జుట్టుకి మంచి పొడవుగా, మందంగా పెరుగుతుందని జుట్టు సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: