నైట్ ఇలా చేశారంటే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం?

frame నైట్ ఇలా చేశారంటే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం?

Purushottham Vinay

మన ముఖం అందంగా ఉండాలంటే మనం ప్రతి రోజూ కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకోవాలి. అలా కనుక తీసుకుంటే చర్మానికి చాలా రకాలుగా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ రెండింటినీ ఎలా తీసుకోవాలంటే.. ఒక వెల్లుల్లి తీసుకుని దాన్ని బాగా నలిపి ఆ తరువాత దానిపై ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పూట నిద్రకు ముందు తినాలి. అయితే వెల్లుల్లిని తిన్నాక నోరు వాసన వస్తుందని భావించే వారు మాత్రం వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసి దానిపై తేనె వేసి ఆ మిశ్రమాన్ని ఈజీగా మింగేయవచ్చు. తరువాత గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఇలా ఈ రెండింటి మిశ్రమాన్ని రోజూ రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పును మీరు గమనించవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. వెల్లుల్లి కూడా మన చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. 

ఎందుకంటే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో కణాలనేవి రక్షించబడతాయి. ఇంకా అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల చర్మం తన సహజసిద్ధ రంగును పొందుతుంది. ఇంకా అలాగే వృద్ధాప్య లక్షణాలు కూడా చర్మంపై కనిపించవు. ఇక వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇంకా అలాగే తేనెలో కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎందుకంటే ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల మన చర్మానికి తేనె చాలా రకాలుగా మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఇంకా అలాగే తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లాగా కూడా పనిచేస్తుంది. అందువల్ల చర్మం తేమగా ఉండి మృదువుగా మారుతుంది. అలాగే మన చర్మంలో కాంతి పెరుగుతుంది. ఇక తేనె గాయాలు, పుండ్లను కూడా చాలా త్వరగా మానేలా చేస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్‌) చెబుతున్న ప్రకారం తేనె మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: