వెనిగర్ తో చర్మ ఇలా సౌందర్యాన్ని కాపాడుకోండి

Bhavannarayana Nch

వెనిగర్ సాధారణంగా వంటలలో వాడుతారు..ఈ వెనిగర్ కేవలం వంటలకే కాదు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.ఈ వెనిగర్ చర్మం మరియు జుట్టు యొక్క పని తీరులు మెరుగుగా చేయడానికి ఉపయోగపడుతుంది.అంతేకాదు చుండ్రు పోవడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది

 

వెనిగర్ యోక్క్ ముఖ్యమైన పని ఏమిటి అంటే ఇది చర్మం మీద మచ్చలని తొలగిస్తుంది..అంతేకాదు కాలిన గాయాలని తగ్గేలా చేస్తుంది జుట్టు నిగ నిగాలాడుతూ మెరిసేలా చేస్తుంది కూడా. మీకు నచ్చిన, మీ చర్మానికి అనువైన ఫేషియల్ టోనర్ దొరకకపోతే మీకు నచ్చిట్లుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు గ్లాసుల నీటిలో కలపండి. మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత, కాటన్ బాల్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

 

ఆ తరువాత కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి. మిశ్రమంలో ఉండే సహజంగా అల్ఫా- హైడ్రాక్సీ ఆసిడ్ మరియు ఎసితిక్ ఆసిడ్ రక్త ప్రసరణను మెరుగుపరచటమే కాకుండా..ముఖ చర్మంపై ఉండే రంధ్రాలను పూడ్చుతుంది.

సగం కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను నాలుగు కప్పుల నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని సన్ బర్న్ కు గురైన ప్రాంతాలలో శుభ్రమైన గుడ్డ సహాయంతో అప్లై చేయండి. ఇలా చేయడం వాల్ల ఇది చర్మం యొక్క pH స్థాయిలను తిరిగి అందిస్తుంది ..

 

స్నానం చేసే ఒక బకెట్ వేడి నీటికి కొన్ని చుక్కల వెనిగర్ ను కలిపి స్నానం చేయటం వలన చర్మాన్ని సమతుల్య పరుస్తుంది. ఎందుకంటే.. వెనిగర్ యొక్క pH స్థాయిలు మరియు ప్రోటోఆక్టివ్ ఆసిడ్ మాంటిల్ లేయర్ pH లు కూడా సమానం.

 ఆపిల్ సైడర్ వెనిగర్ (రెండు చెంచాల) రెండు కప్పుల నీటిని కలపటం ద్వారా జుట్టును కడిగే మంచి ద్రావణంగా పేర్కొనవచ్చు. నీటితో జుట్టు కడగటం అయిన తరువాత తేలికైన కండిషనర్ తో వెనిగర్ ద్రావణాన్ని అప్లై చేయండి. మిశ్రమంలో ఉండే ఎసిటిక్ ఆసిడ్ జుట్టుపై ఉండే అవశేషాలను తొలగించి, జుట్టుని మెరిసేలా చేస్తుంది.

 

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాంటీ..ఫంగల్ గుణాలను చుండ్రుకు నివారణకి పోరాడతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీటిని కలిపి, యాంటీ డాండ్రఫ్ షాంపూను తయారు చేసుకోవచ్చు. షాంపూ లాగానే దీనిని మీ తలపై చర్మానికి మసాజ్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: