చలికాలంలో పగిలే "పాదాల రక్షణకు" ఇంటి చిట్కాలు

Bhavannarayana Nch

శీతాకాలంలో చర్మ సంరక్షణకోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి..ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా చర్మం కుచించుకు పోతుంది..చర్మం మీద దద్దుర్లు రావడం..వాటి వాళ్ళ పుండ్లు పడటం జరుగుతాయి..పెదాలు పగుళ్ళు రావడం..అరచేతులు పిడసగట్టి పోవడం జరుగుతుంది.అలాగే  పాదాలు చివర్లు పగుళ్ళు కూడా ఏర్పడతాయి.

అయితే చాలా మంది పాదాల మీద దృష్టి పెట్టరు.దాంతో అవి పగిలిపోయి,పొడిబారినట్టుగా కనిపిస్తాయి.ఎందుకంటే చర్మంపై ఉండే సహజసిద్ధమైన తేమ తగ్గిపోవడమే దానికి ప్రధానమైన కారణం.

 

పాదాలు సంరక్షణకి పాటించవలసిన పద్దతులు

 

శీతాకాలంలో ప్రతిరోజూ మీ పాదాలను తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం..ఇలా చేస్తే  మీ పాదంపై ఉన్న చర్మాన్ని సున్నితంగా చేయడమే కాకుండా పొడిబార కుండా కూడా చేస్తుంది. రోజుకు ఒకసారి, మీ రెండు పాదాలకు మాయిశ్చరైజర్ చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. సున్నితంగా ఉంటుంది.

 

శీతాకాలంలో తప్పక అనుసరించాల్సిన మరో చిట్కా..గోరువెచ్చని నీటిలో కొంచం నిమ్మరసం కలిపి ఆ తరువాత పాదాలని ఈ నీళ్ళు ఉన్న టబ్ లో ఉంచాలి..ఈ తేలికైన చిట్కాతో మీ పాదంపై ఉన్న చర్మాన్నిశుభ్రంగా..ఆరోగ్యంగా ఉంచుతుంది.పాదాలు తీసిన తరువాత పొడి గుడ్డతో..తుడిచేస్తే సరిపోతుంది.

 

పాడాలని   కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం అనేది అద్భుతమైన మార్గం ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ బాగుంటే చర్మం మృదువుగా కనిపిస్తుంది...అంతేకాదు కొబ్బరి నూనెలో కొంచం కర్పూరం వేసుకుని మర్దనా చేస్తే కాళ్ళ మంటలు కూడా పోతాయి.

 

రాత్రి పూట పడుకునే ముందు పాదాలకి  కొంచం నువ్వుల నునే రాసుకుని మెల్లగా మర్దనా చేసుకుని..ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నేటితో కడగాలి ఇలా ప్రతీ రోజు చేస్తూ ఉంటే చలికాలం మీ పాదాలని పగుళ్ళ నుంచీ కాపాడుకోవచ్చు.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: