“వేసవిలో చర్మాన్ని” కాపాడే అభ్బుతమైన ఇంటి చిట్కాలు

Bhavannarayana Nch

వేసవి కాలం వస్తుంది అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు..రోజువారి కాలుష్యం , సూర్యుడి ప్రతాపం ఈ రెండు ప్రభావాల వలన చర్మం మరింతగా దెబ్బతింటుంది..ముఖ్యంగా యుక్తవయసులో ఉండే వారికి ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం మరింతగా పాడయ్యే ప్రమాదం ఉంది..అందుకే బయటకి ఎక్కడకీ వెళ్ళకుండా ఇంట్లో దొరికే పదార్ధాలతోనే మీ చర్మాన్ని కాపడుకోగలిగేలా కొన్ని వంటింటి చిట్కాలు పాటించండి..ఇలా చేస్తే తప్పకుండా మీ చర్మాన్ని వేసవి బారి నుంచీ కాపాడుకోవచ్చు..

 

ముఖ్యంగా వేసవిలో చర్మం పొడిబారడం.. చర్మం వదులుగా అయిపోవడం పేలవంగా తయారవ్వడం లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది..ఎక్కువగా వేసవిలో డీ హైడ్రేషన్ కి లోనవ్వడంలో చర్మం మరింతగా పొడి అయ్యిపోతుంది..అయితే ఈ చిట్కాల వలన చర్మం తేమని కోల్పోకుండా కాపడవచ్చు...ఈ చిట్కాలలో మొదటి చిట్కా ఏమిటంటే..

 

రసాయనిక ఎరువులతో కాకుండా సహజసిద్ధంగా పండిన నారింజ తొక్కల పొడి అర టీస్పూను తీసుకుని మరియు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి స్క్రబ్ అయ్యేలా చేసుకోవాలి...ఆ తరువాత ముఖమును తడిగా ఉంచుకుని (తక్కువ నీటితో), కొద్ది నిమిషాలు సుతారంగా చల్లని నీటితో మసాజ్ చేసుకోవాలి ..ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై అద్దుతూ మసాజ్ చేసుకోవాలి..ఇలా చేసిన తరువాత ఒక గంటపాటు ఈ మిశ్రమాన్ని ఆరేవరకూ ఉంచాలి..దీనివలన ముఖంపై ఏర్పడే రంద్రాలని పూడ్చడంలో ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది..చర్మంపై తేమ పెరిగేలా చేస్తుంది.


అంతేకాదు  మరొక  వంటింటి చిట్కా ద్వారా కూడా మనం చర్మాన్ని కాపాడుకోవచ్చు...చక్కెర, నిమ్మ రసం, రోజ్ ఆయిల్ తో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చు అనేది చూద్దాం..ఒక గిన్నెలో అర టీస్పూన్ చక్కర పొడి, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, 3,4 చుక్కల గులాబీ నూనె ను వేసి ఒక మిశ్రమంగా చేసుకోవాలి ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖం పై అన్నీ ప్రదేశాలకు పట్టించాలి..కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి..ఇలా చేయడం వలన ముఖంపై వచ్చే మొటిమలు కానీ మృత కణాలని నాశనం చేస్తుంది..



 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: