“జుత్తు సహజసిద్ద పద్దతి” లో ఒత్తుగా” పెరగాలంటే..

Bhavannarayana Nch

చాలా మందికి జుత్తు ఒత్తుగా పెరగదు..రోజు రోజుకి ఊడిపోతు ఉంటుదని..దానికి కారణాలు వెతికే లోగానే సగం జుట్టుని కోల్పోతారు..హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే జుత్తు కి సరైన రక్షణ కల్పించలేక పోతారు.కానీ సహజసిద్ధంగా పెరిగిన జుట్టుని సహజ పద్దతులలోనే ఎలా రక్షించుకోవాలో మాత్రం పాటించరు..ఎప్పుడైతే జత్తుకి ఆరోగ్యకరమిన పోషకాలు..జాగ్రత్తలు అందుతాయో అప్పుడు జుట్టు సంరక్షణ సులభం అవుతుంది..అయితే ఈ సింపుల్ టిప్స్ ని పాటించడం వలన జుట్టుని సులభంగా కాపాడుకోవచ్చు..ఎలా అంటే..

 

 జుత్తుపై ఉండే దుమ్ము, ధూళి వలన కేశాలు దెబ్బతింటాయి..ప్రతి ఎనిమిది వారాలకి ఒక సారి జుట్టుని ట్రిమ్మింగ్ ( కొంచం కత్తిరించడం) చేయడం వలన జుత్తు పెరుగుదల వేగంగా ఉంటుంది..అయితే ఇవన్నీ శిరోజాల చివర్లను రఫ్ గా మార్చి స్ప్లిట్ ఎండ్స్ కి దారితీస్తాయి. తరచూ హెయిర్ ను ట్రిమ్ చేయడం ద్వారా స్ప్లిట్ ఎండ్స్ ని తొలగించుకోవచ్చు. ఇలా చేస్తే, జుత్తు  ఎదుగుదలకు ఎటువంటి అవరోధం 


అయితే జుత్తు చివరి భాగాలు ఎక్కువగా చిట్టినట్లుగా ఉండటం మీరు గమనించి ఉంటారు..అయితే జుత్తు మొదలు ఎంత బలంగా ఉన్నా కూడా చివర్లు మాత్రం చిట్లినట్లుగా ఉంటాయి. ఎందుకంటే, శిరోజాల చివర్లకు పోషణ లభించదు. ఈ పరిస్థితిని గమనించి మీరు శిరోజాల చివర్లకు కూడా పోషణనివ్వడం ప్రారంభించాలి...ఏలా అంటే ప్రతి హెయిర్ వాష్ తరువాత కండిషనింగ్ చేయడం ద్వారా వెంట్రుకల చివర్లకు పోషణ లభిస్తుంది. శిరోజాలను మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇలా చేస్తే మీ శిరోజాలు ఆరోగ్యంగా మారి శిరోజాల పెరుగుదల బాగుంటుంది.


చాలా మంది తల స్నానం చేసిన తరువాత తడిజుట్టును టవల్ లో చుట్టడం చేస్తారు  ఇలా చేయడం వలన జుత్తు కి నష్టం ఎక్కువగా ఉంటుదని చాలా మందికి తెలియదు...తడి జుట్టు వలన జుత్తు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. తడిజుట్టును టవల్ తో చుట్టేయడం వలన ఈ సమస్య మరింత పెరుగుతుంది..టవల్ ఫైబర్స్ కి వెంట్రుకలు రబ్ అవడం వలన వెంట్రుకలు రాలే ప్రమాదాన్ని గమనించి ఈ అలవాటును మానుకోవాలి...ఒక వేళ ఈ అలవాటుని మానుకోక పొతే మైక్రో ఫైబర్ టవల్స్ ను వాడటాన్ని ప్రిఫర్ చేయాలి.

అన్నిటి కంటే ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి..మీరు ఎంత ఒత్తిడికి లోనయితే అంతగా జుత్తుకి నష్టం కలుగుతుంది.. అందుకే ఒత్తిడికి లోనవుతున్న సమయంలో మీరు ప్రశాంతంగా యోగా లాంటి పనులకి చేస్తుంటే మెల్లగా ఒత్తిడి నుంచి దూరం అవుతారు...దీనివల్ల జుట్టు ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా తగ్గుతుంది..


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: