“వేసవి కాలం” లో చర్మాన్ని కాపాడుకునే “చిట్కాలు”

Bhavannarayana Nch

వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మంపై ఎండ వేడిమి తీవ్రమైన ప్రభావం చూపుతుంది..చెమటకాయలు..పట్టడం చర్మం నల్లగా మారిపోవడం..జిడ్డు కారడం..ఒళ్ళంతా పేలిపోవడం జరిగి చర్మం  పాడయ్యి పోతుంది..ఎండలోకి వెళ్ళకుండా నీడపట్టున ఉన్నా సరే చాలా మందికి ఈ ప్రభావం చూపిస్తుంది..ఈ కాలంలో ఇది సహజమేగా అని వదిలేస్తే చర్మం మొద్దు బారిపోయి..చర్మానికి ఉన్న సహజమైన సౌందర్యాన్ని,మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది..అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని కాపాడుకుంటూ మరింత మెరుగుపరుచుకోవచ్చు..అది ఎలా అంటే..

 

అసలు వేసవిలో చర్మం పాడవడానికి కారణం ఏమిటంటే డీ హైడ్రేషన్ అంటే చర్మం శరీరంలో నీటిని కోల్పోవడం..ఎప్పుడైతే చర్మం తేమని కోల్పోయిందో అప్పుడు చర్మం పొడి బారి పాడవుతుంది అందుకే  రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి...అందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మరింత మంచిది...వేసవిలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది అలాంటి సమయంలో ఎక్కువగా సబ్బుతో చాలా మంది కడుగుతూ ఉంటారు అలా చేయడం మంచి పద్దతి కాదు...దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఎంతో మంచిది.


అయితే అసలు వేసవిలో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే..,మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం అన్నింటికంటే ముందుగా చేయాల్సింది..మనం ఎప్పుడు త్రాగే నీటికంటే ఒక లీటరు నీటిని ఎక్కువగానే తీసుకోవాలి వేసవి కాలంలో వేడిమి వలన శరీరం నుంచీ చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకి వెళ్తుంది కాబట్టి శరీరంలో నీరు మంరింతగా ఉండటానికి ఎక్కువగా గానే నీటిని తీసుకోవాలి..

 సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి...అందువల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయి.. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది....అయితే పోటీ ప్రపంచంలో బయటకి వెళ్ళకుండా ఎండలో నుంచుని పనులు చేయకుండా ఉండటం కష్టం కాబట్టి..ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ పడే భాగాల్లో రాసుకోండి...ఇది శరీరంలో చర్మం ముడతలు పడకుండా చర్మం పాడవకుండా కాపడుతుంది..

 

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎండాకాలంలో తినే ఆహరం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: