“నిమ్మకాయ” తో మృదువైన చర్మం మీ సొంతం

Bhavannarayana Nch

ముఖ సౌందర్యం విషయంలో చాలా  మంది ఎంతో శ్రద్ధ వహిస్తారు..ఎందుకంటే ముఖ సౌందర్యం బాగుంటే మనలో ఆత్మ విశ్వాసం మెరుగుపడుతుంది..మెరిసే చర్మం ఉంటే చర్మ ఆరోగ్యం  కూడా ఎంతో ఆరోగ్యంగా కూడా  ఉంటుంది..అంతేకాదు చాలా మంది నీళ్ళు ఎక్కువగా త్రాగడం, విశ్రాంతి ఎక్కువగా తీసుకువడం వంటి పనులు చేస్తూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు అయితే..చర్మం నిగారింపు తీసుకువచ్చి సహజంగా ఉంచడానికి నిమ్మకాయ చేసిన సాయం మరేదీ  చేయలేదు..

 

ఫేస్ మాస్కు దగ్గర నుంచీ పాదాల స్క్రబ్స్ లో ఇలా అన్ని బ్యూటీ ఉత్పత్తుల్లో వాడే నిమ్మ లేకుండా ఒక్క ఉత్పత్తి ఉండదంటే ఆశ్చర్యం లేదు. కలుగక మానదు..అయితే ఈ నిమ్మకాయలు ఎంతో చవకగా దొరుకుతాయి..నిమ్మలో ఉండే  సిట్రస్ అనే గుణం నిమ్మకాయ ఎన్నో రకాల వ్యాధులని, వ్యాధులని కలిగించే బ్యాక్టీరియాని పోగొడుతుంది..నిమ్మకాయ వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

నిమ్మకాయతో టోటల్ బాడీ ని స్క్రబ్ చేయవచ్చు అది ఎలా అంటే..ముందుగా ఒకటిన్నర కప్పు పంచదారను తీసుకుని, అరకప్పు ఆలివ్ నూనె, ఒక చెంచా తేనెతో కలిపి ఉంచండి దానికి అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుని ఈ మిశ్రమానికి బాగా కలిఫై మొత్తం శరీరమంతా దీనితో 5 నుంచి 10 నిమిషాలు రుద్దండి. ఈ స్క్రబ్ ను మామూలుగా కడిగేయాలి ఇలా చేస్తే శరీరం మొత్తం బ్యాక్తీరిగా లేకుండా స్మూత్ గా తయారవుతుంది..



అలాగే గుడ్డు సోనని ఒక చెంచాడు తీస్కుని దానికి నిమ్మరసంతో కలిపి, దానికి రెండు చెంచాల పెరుగు కూడా కలపాలిఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట పాటు ఉంచాలి కంటి చుట్టూ తగలకుండా,ప్రభావం పడకుండా చూసుకోండి. ఈ అరగంటలో మీకు గట్టిగా దగ్గరకి చర్మం లాగబడినట్లు అన్పిస్తుంది...దీని వలన సాగినట్టుగా ఉండే చర్మం దగ్గరకు చేర్చబడుతుంది..

 


అయితే చాలా మంది ఎదుర్కునే సమస్య బ్లాక్ హెడ్స్ ఇది శరీరంలో మ్కుక్కు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది దానికోసం ఒకనిమ్మకాయని తీసుకుని దానిని సగానికి కోయండి ఆ తరువాత తేనెలో ముంచి మీ ముక్కు చివర్ల, బ్లాక్ హెడ్స్ వచ్చే చోట రుద్దండి. ఇలా 5 నిమిషాలపాటు చేసాక, గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ రావడం ఆగిపోతాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: