“టూత్ పేస్టు”...తో “అందమైన” లాభాలు

Bhavannarayana Nch

ఉదయం లేవగానే దంతాలు శుభ్రం చేసుకోవడానికి అందరు ఉపయోగించేది టూత్ పేస్టు ఇది అందరికీ తెలిసిన విషయమే...అయితే ఈ టూత్ పేస్ట్ తో అన్నో అద్భుతమైన సౌందర్య చిట్కాలు చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు..చర్మం నుంచీ జుట్టు పెదాలు సంరక్షణకి అందం యొక్క పెరుగుదలకి టూత్ పేస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది..అయితే టూత్ పేస్ట్ ని ఎలా ఉపయోగించాలి అనే విషయం గనుకా తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం మానేస్తారు..

 

అయితే టూత్ పేస్ట్ లో అన్ని రంగులలో ఉన్న పేస్టు లు పనికి రావు కేవలం తెల్లగా ఉన్న పేస్ట్ మాత్రమే సౌందర్య సాధనంగా  ఉపయోగ పడుతుంది..అందుకే ఈ నియమాన్ని మాత్రం తప్పకుండా అందరూ పాటించాలి..సరే ఇప్పుడు ఈ టూత్ పేస్టు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..ముందుగా మొటిమల నివారణకి టూత్ పెస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే..


టూత్పేస్టులో ట్రిక్లోసెన్ అనే పదార్ధం ఉంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది మొటిమలను చికిత్సలో బాగా సహాయపడుతుంది. నిద్రపోయే సమయంలో మొటిమలపై కొద్దిగా టూత్ పేస్టును చిన్న ముద్దలా ఉంచాలి అయితే ఇలా రెగ్యులర్ గా చేయడం వలన కొన్ని రోజుల్లోనే మొటిమలు పోతాయి.

 

అంతేకాదు మన చేతి గోళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం గోరింటాకు నైల్ పాలిష్ ఇలా ఎన్నో పాత పద్దతులని ఉపయోగిస్తుంటాము అయితే టూత్ పేస్ట్ దంతాలపై ఉండే ఎనామిల్ ని ఎలా అయితే కాపాడుతుందో అలాగే టూత్ పేస్ట్ కూడా గోళ్ళపై ఉండే మెరిసే తత్వాన్ని కాపాడి తద్వారా గోరు పాడవకుండా కాపాడుతుంది.

 


అలాగే  చాలా మందికి కాలిన గాయాలు కానీ కీటకాలు కుట్టడం వలన వచ్చే నల్లటి మచ్చలు కానీ బయటకి కనిపించి అందవిహీనంగా కనిపిస్తాయి..అయితే ఇటువంటి సమస్యలకి టూత్ పేస్ట్ ఏంతో అద్భుతంగా పనిచేస్తుంది కాలిన చర్మ ప్రాంతంలో పేస్టు ని ఉంచడం వలన  గాయం నుంచి చల్లబరిచిన అనుభూతిని కలిగిస్తుంది. దెబ్బతిన్న చర్మ ప్రాంతంలో టూత్ పేస్ట్ను వెంటనే అప్లై చెయ్యడం వల్ల అది బొబ్బలను, మచ్చలను ఏర్పడనీయకుండా చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: