"జిడ్డు చర్మానికి".... చెక్ పెట్టేయండి..!!!!

NCR

జిడ్డు చర్మాన్ని కావాలని ఎవరూ కోరుకోరు.. అలాంటి చర్మం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయి కూడా..బయటకి వెళ్ళే ముందు ఎంత శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకుని వెళ్ళినా కూడా జిడ్డు కారే చర్మం ఉన్నవారికి చేతి రుమాళ్ళు తడిచిపోయి దుర్వాసన వస్తూఉంటాయి కూడా..మరి అలాంటి చర్మానికి చెక్ పెట్టి మీ చర్మాని కాపాడుకుని మృదువుగా కాంతివంతంగా చేసుకోవాలంటే..కొన్ని పద్దతులు పాటించక తప్పదు.

 

మనం నిత్యం  ఆహారంలో ఉపయోగించే పసుపు ద్వారా నిరంతరం జిడ్డు కారే చర్మాన్ని కొన్ని రోజుల్లోనే అదుపు చేయవచ్చు. గాయాలని తొలగించడంలో , హాని కలిగించే బ్యాక్టీరియా ని నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడే పసుపు. చర్మాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..జిడ్డు కారే చర్మాన్ని పసులు ఎలా నివారిస్తుందంటే..


పసుపు చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉత్పత్తికి దారితీసే చర్మరంధ్రాలను నివారించడానికి ఉపయోగపడే  యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రంచేసే క్లెన్సర్ లా పని చేస్తుంది. కాదు చర్మం మీద పేరుకుని పోయిన జిడ్డుని తొలగించి ముఖాన్ని తాజాగా ఉదేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మంపై శ్లేషపటలం నుండి నూనెల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా జిడ్డు చేరకుండా నివారించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది.

 

అందుకే పూర్వకాలం నుంచీ కూడా స్త్రీలు స్నానం చేసే ముందు పసుపుతో ముఖాన్ని రుద్దుకుని. చేతులకి కాళ్ళకి పట్టించి మరీ స్నానం చేస్తారు. అలా రోజు వారి వారు చేయడం ద్వారా ముఖంపై ముడతలు మొదలు, జిడ్డు , మొటిమలు దరి చేరవు...అయితే మారుతున్న కాలంలో రసాయనిక క్రీములని ఫేస్ ప్యాక్ లని వాడుతున్న వారికి చర్మ సమస్యలు దీర్ఘకాలికాలికంగా ఉంటూనే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: