"టీ "..తాగితే.. "మొటిమలు".. వస్తాయా...??

NCR

ప్రతీ యువతీ యువకులకి అందమైన ముఖం కావాలని అనుకోవడం సహజమే, అయితే కొన్ని ఆహారపు అలవాట్ల వలన వారి ముఖం పై మొటిమలు రావడం, ముఖం కాంతివంతంగా లేకపోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా యువతులలో అధికశాతం మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటికి అనేక రకాల కారణాలు కూడా భాగం అవుతాయి. అయితే ఆహారపు అలావాట్లలో గనుకా నియమాలు పాటిస్తే మొటిమలని ఎదుర్కోవడం పెద్ద విషయమూ కాదు. అయితే ఈ ఆహారపు అలవాట్లలో “టీ” కూడా ఒక కారణం అవుతోందా..???

 

అసలు మొటిమలు రావడానికి అసలు కారణం ఏమిటంటే.. మన సెబాషియస్ గ్రంధుల నుంచీ ద్రవం ఉత్పత్తి కి సమయం పట్టడం వలన మొటిమల సమస్య తలెత్తుతుంది. చమురు, మురికి, మృత కణాలు వంటివి హెయిర్ ఫోలికల్స్ వద్ద అవరోధాలుగా ఉన్న కారణంగా, ఇన్ఫెక్షన్ కి కారణమై పరిస్థితి చే జారిపోతుంది.ఈ రకమైన పరిస్థితి  సాధారణంగా యవ్వన దశలో హార్మోన్ల అసమతౌల్యం వలన సంభవిస్తుంది. ఇదిలాఉంటే అసలు టీ సేవించడం, మొటిమల సమస్యకు ఏవిధంగా కారణం అవుతుంది ? అనే వివరాలలోకి వెళ్తే..

 

టీ త్రాగడం వలన మొటిమలు వస్తాయా అంటే అది టీ తయారు కాబడిన పద్దతిపైనే ఆధారపడి ఉంటుంది. పాలు మరియు పంచదార కలిపిన టీ ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు కాదని తెలుస్తోంది..పాలు సెబం ఉత్పత్తిలో కీలకపాత్రను పోషించడం వలన ఇది అధిక చమురు మొటిమలకు దారి తీస్తుంది. పాలని తొందరగా జీర్ణించు కోవడం చాలా కష్టం కాబట్టి, జీర్ణక్రియలు కూడా చర్మ రోగాలకి దారి చూపుతాయి.

 

మొటిమలు నివారించడానికి టీ  తీసుకునే వారు తక్కువగా తీసుకుంటూ మెల్ల మెల్లగా కంట్రోల్ చేసుకోండి. టీ స్థానంలో గ్రీన్ టీ తీసుకోవడం చాలా ఉత్తమం. దీని వలన మెరుగైన ఫలితాలు అందుతాయి. శరీరంలో చెక్కరల స్థాయి అధికంగా ఉన్నప్పుడు తప్పకుండా మొటిమలకి దారి తీస్తుంది. కాబట్టి గ్రీన్ టీని సహజమానే తీసుకోండి.ఇలా చేసి చూస్తె తప్పకుండా మీరు మొటిమల నుంచీ విముక్తి పొందుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: