అందమైన పాదాల కోసం..సింపుల్ చిట్కా...!!!

NCR

అందం అంటే కేవలం ముఖానికి సంభదించిన విషయం మాత్రమే కాదు. ఒక వేళ ముఖం ఎంతో అందంగా ఉన్న సరే చేతులు, పాదాలు, వేళ్ళు పొడిబారినట్టుగా, అందవిహీనంగా ఉంటే ఏమి ప్రయోజనం ఉండదు. చాలా మంది ముఖ సౌదర్యం పై చూపించే శ్రద్ద, పాదాలపై అస్సలు చూపించరు.దాంతో ఒక్క సారిగా వాటికి తేమ తగ్గిపోయి పొడిబారినట్టుగా అందవిహీనంగా అయిపోతాయి. పాదాలు తేమగా ఉంటేనే ఎంతో చక్కగా కనిపిస్తాయి. మరి పాదాలకి తేమ కలిగి, అందంగా మారడానికి ఎలాంటి చిట్కాలని పాటించాలో తెలుసుకుందాం..మనం రోజు వారీ వాడే వాటితోనే మనం సులభంగా ఈ సమస్యని అధిగమించవచ్చు.

 

మజ్జిగలో కొంచం పసుపు వేసి దాన్ని బాగా కలిపి రెండు పాదాలకి రాసి బాగా ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలకి తేమ పట్టి మంచి ఫలితం కనపడుతుంది. అయితే ఫలితం పొందాలంటే మాత్రం వారానికి కనీసం 3 రోజులు అయినా చేయాలి అప్పుడే చక్కని ఫలితం దక్కుతుంది.

 

ఒక చెంచాడు శనగపిండిలో అర చెంచా తేనే , అరచెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా పేస్టు లా చేయాలి. ఈ ముద్దని పాదాలకి రాసి అరగంట అయిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు.

 

అదేవిధంగా రెండు స్పూన్స్ పైనాపిల్ జ్యూస్ లో అరస్పూన్ తేనే కలిపి పదాలకి రాసి 20 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి ఇలా చేయడంవలన పాదాలకి రక్త ప్రసరణ బాగా జరిగి పాదాలు అందంగా ఆరోగ్య వంతంగా మారుతాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: