"తెల్లజుట్టు" సమస్యకి “బ్లాక్” టీ తో చెక్...!!!

NCR

తెల్ల జుట్టు పూర్వం సుమారు 40 ఏళ్ళు దాటినా వారికి కూడా తెల్ల జుట్టు  మచ్చుకైన కనపడేది కాదట. 45 నుంచీ 50 మధ్యలో వయసు వారికి తెల్లజుట్టు ప్రారంభం అయ్యేదట. కానీ నేటి సమాజంలో ఆహార్య కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం అన్ని కారణాలు కలిసి తెల్ల చుట్టూ అత్యంత చిన్న వయసులోనే రావడానికి కారణం అవుతున్నాయి.

 

పట్టుమని 15 ఏళ్ళు వచ్చిన వారికి కూడా తెల్ల జుట్టు కనిపిస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో  అర్థం చేసుకోవచ్చు. ఈ తెల్ల జుట్టు సమస్య కారణంగా పెళ్ళిళ్ళు కాని వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఈ తెల్ల జుట్టుకి పరిష్కారం కావాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

 

తెల్ల జుట్టుని నివారించాలంటే ముఖ్యంగా అందరూ పాటించే పద్దతి బ్లాక్ టీ. మరగ బెట్టిన బ్లాక్ టీని ఒక కప్పులోకి తీసుకోవాలి. అందులో ఎటువంటి పాలు, పంచదార వంటివి కలపకూడదు. ఇప్పుడు ఈ టీ లో ఒక చెంచాడు ఉప్పు కలపాలి. బాగా కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించాలి. ఇలా చేసిన అరగంట తరువాత కుంకుడు తో గానీ, లేదా శీకాయ తో గాని శుభ్రంగా స్నానం చేసి మెత్తని గుడ్డతో జుట్టుని తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: