హెరాల్డ్ బర్త్ డే : 06-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

మే 6వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే.. ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం  రండి. 

 

 మోతిలాల్ నెహ్రూ జననం : భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు అయిన మోతిలాల్ నెహ్రూ 1861 మే 7వ తేదీన జన్మించారు. బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు మోతీలాల్ నెహ్రూ. ఆగ్రాలో పుట్టిన మోతిలాల్ నెహ్రూ ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో నుంచి బారిష్టర్ డిగ్రీని పొందారు. మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ.నెహ్రు  కుటుంబం నుంచి ఎంతోమంది మన జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగారు. 

 

 హరిశ్చంద్ర రాయల జననం : రంగస్థలం టీవీ సినీ నటుడు అయిన హరిశ్చంద్ర రాయల 1965 మే 6వ తేదీన అనంతపురం జిల్లాలో జన్మించారు. రంగస్థల దర్శకులు రూపశిల్పి అయిన ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 30 సంవత్సరాలుగా తెలుగు నాటక రంగంలో కృషి చేస్తున్నారు హరిశ్చంద్ర రాయల . అంతేకాకుండా భారతదేశంలోనే మేకప్ కాస్ట్యూమ్స్ అంశాలపై పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తి హరిశ్చంద్ర రాయల . హరిశ్చంద్ర రాయల తండ్రి కూడా రంగస్థల నటుడు. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే  తరచుగా నాటకాలలో నటించే వారు హరిశ్చంద్ర రాయల తండ్రి రామాంజనేయులు. తనలాగే  తన కుమారుడు కూడా నాటక రంగంలో పేరు తెచ్చుకోవాలని చిన్నతనం నుంచి ఎంతో ప్రోత్సహించేవారు. ఇక తండ్రి ప్రోత్సాహంతో హరిశ్చంద్ర  రాయల  ఎనిమిదవ తరగతి నుంచే పాఠశాలలో నాటకాలు పోటీలు నటించి ఉత్తమ రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 1986, 87, 88 సంవత్సరాల్లో గుంటూరులోని తెలుగు కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా నాటక పోటీలు నిర్వహించగా ఆ మూడు సంవత్సరాల్లో ప్రదర్శించే నాటకాల్లో నటించి మూడు సంవత్సరాలపాటు ఉత్తమ రంగస్థల నటిగా అవార్డులు అందుకున్నారు హరిశ్చంద్ర రాయాల. ఇక రంగస్థల నటునిగా ఎన్నో వైవిధ్యమైనా  నాటకాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు హరిశ్చంద్ర. 

 

 రాబర్ట్ పియరీ జననం : భౌగోళిక ఉత్తర ధ్రువం చేరుకున్న మొదటి అన్వేషణ యాత్రికుడు గా పేరుగాంచిన రాబర్ట్ పియరీ 1856 మే 6వ తేదీన జన్మించారు. ఈయన ఒక అమెరికన్ అన్వేషకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: