హెరాల్డ్ బర్త్ డే : 22-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

frame హెరాల్డ్ బర్త్ డే : 22-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే మే 22వ తేదీన  ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 

 విలియం స్టర్జియన్  జననం : మొదటి ఆచరణాత్మకమైన విద్యుదయస్కాంత నిర్మాత... ఆంగ్ల శాస్త్రవేత్త అయిన విలియం స్టర్జీయాన్  1783 మే 22వ తేదీన జన్మించారు.

 

 పరవస్తు వెంకట రంగాచార్యులు జననం : సంస్కృతాంధ్ర పండితులు ప్రముఖ తత్వవేత్త.. తర్కము, వ్యాకరణములలో  తెలుగు కవి అయినా పరవస్తు వెంకట రంగాచార్యులు 1822 మే 22వ తేదీన జన్మించారు. ఈయన  తర్కము వ్యాకరణము లలో ఎంతోమంది ప్రసిద్ధి . ఆయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు. సంస్కృతం ప్రాకృతం భాషలలో నిష్ణాతులు పరవస్తు వెంకట రంగాచార్యులు. విశాఖపట్నం లోని గ్రంధ ప్రదర్శన నిర్వహకులు పరవస్తు వెంకట రంగాచార్యులు. ఎనిమిదేళ్ళ వయసులోనే సంస్కృతంలో కుంభకర్ణ విజయం అనే కావ్యము రచించారు. ఆ రోజుల్లో విజయనగరం మైసూరు మహారాజులూ ఈయనను  గౌరవించి సత్కరించారు. అన్నింటికంటే మించి ఈయన శతావధానం లో నిశ్చేష్టుడై మహామహోపాధ్యాయ బిరుదును పొందారు. అంతేకాకుండా ఈయన తెలుగులో ప్రప్రథమంగా ఒక విజ్ఞాన సర్వస్వమును వ్యక్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీటిల్లో ఈయన  40 సంవత్సరాలు శ్రమించి ఆ నుంచి ఆ  వరకు మాత్రమే పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత ఈ బృహత్తర కార్యక్రమాన్ని కొమర్రాజు లక్ష్మణరావు చేపట్టారు. 

 


 రాంరెడ్డి వెంకట్ రెడ్డి జననం  : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి 1944 మే 22వ తేదీన జన్మించారు. ఈయన  ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన రాంరెడ్డి వెంకట్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి పదవులను సైతం అలంకరించారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాంరెడ్డి వెంకటరెడ్డి 1967 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సర్పంచ్ గా  తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆ తర్వాత క్రమక్రమంగా ఏకంగా  మంత్రి స్థాయికి ఎదిగారు.1996లో ఉపఎన్నికల ద్వారా సుజాతనగర్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సుజాతనగర్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009, 2014లో వరుసగా  ఎమ్మెల్యేగా గెలిచి ఓటమెరుగని రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు రాం  రెడ్డి వెంకట్ రెడ్డి. 2009 నుంచి 2014 మధ్యకాలంలో మంత్రిగా కూడా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: