హెరాల్డ్ బర్త్ డే : 18-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?
సర్వాయి పాపన్న జననం : గెరిల్లా సైన్యానికి నాయకుడు.. గెరిల్లా సైన్యంతో మొగల్ చక్రవర్తి పై దాడి చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18వ తేదీన జన్మించారు. నేటి వరంగల్ జిల్లాలో జన్మించిన సర్వాయి పాపన్న... చిన్నప్పటినుంచే స్వేచ్ఛ భావాలను కలిగి ఉండేవారు. సర్వాయి పాపన్న ను పాపడు అని పిలిచేవారు. శివుడికి పరమ భక్తుడు అయిన సర్వాయి పాపన్న... మొఘల్ చక్రవర్తుల కు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టారు, ఎంతో శక్తివంతమైన గెరిల్లా సైన్యాన్ని తయారుచేసి మొగల్ చక్రవర్తుల పై తిరుగుబాటు చేశారు సర్వాయి పాపన్న.
నిర్మల సీతారామన్ జననం : భారత దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు... కేంద్ర మంత్రి అయిన నిర్మల సీతారామన్ 1959 ఆగస్టు 18వ తేదీన జన్మించారు, కేంద్ర మంత్రి మండలి లో రక్షణశాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా నిర్మల సీతారామన్ రికార్డు సృష్టించారు, 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణశాఖ నిర్వహించారు, తర్వాత రక్షణ శాఖను నిర్వహించిన మొదటి మహిళా మంత్రిగా నిర్మల సీతారామన్ రికార్డు సృష్టించారు, అంతే కాకుండా దేశ ఆర్థిక శాఖకు పని చేసిన తొలి మహిళా మంత్రిగా కూడా నిర్మల సీతారామన్ రికార్డు సృష్టించారు.. అయితే నిర్మల సీతారామన్ అటు రక్షణ శాఖలో ఇటు ఆర్థిక శాఖలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేసారు.
రణవీర్ షోరే జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రణవీర్ షోరే 1972 ఆగస్టు 18 వ తేదీన జన్మించారు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించిన రణవీర్ షోరే... ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు, కేవలం హీరోగానే కాకుండా ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ... ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నారు రణవీర్ షోరే.