మెగాస్టార్ చిరంజీవి కి టాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షలు...
‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’ - మోహన్ బాబు
సినీ పరిశ్రమలో నా ప్రియ మిత్రుడు చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. హ్యపీ బర్త్ డే చిరంజీవి - వెంకటేశ్
చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరొక జనరేషన్‌కు స్ఫూర్తిగా నిలిచారు. అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీకు ఆయరారోగ్యాలు కలగాలి - మహేశ్ బాబు
హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ గారు... మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను సార్... - ఎన్టీఆర్
మా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్‌గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. మీపై ఉండే గౌరవం, ప్రేమ, కృతజ్ఞతలతో నా హృదయం నిండి ఉంటుంది. చాలా విషయాల్లో మీరు నాకు ఆచార్యులు - అల్లు అర్జున్
“ అతను చేసిన సినిమాలు అతన్ని సినిమాకే మెగాస్టార్ ని చేసాయి. అతను తన కుటుంబం పట్ల చూపించే ప్రేమ, కరుణ, భద్రత అలాగే సమాజం పట్ల అతనికున్న శ్రద్ధ చూస్తుంటే నాకు మాత్రం యూనివర్స్ లో నే గొప్ప మెగాస్టార్ గా అనిపిస్తుంది.”
- సాయి ధరం తేజ్
మీరు నాకే కాదు.. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్.. చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- రవితేజ
మా మెగాస్టార్ చిరంజీవిగారికి మెగా బర్త్ డే శుభాకాంక్షలు. ఇలాగే ఇన్‌స్పైర్ చేస్తూ ఉండండి సార్ - రామ్
‘‘హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్. మీరు నా వైపు ఉండటం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నాలో స్ఫూర్తిని నింపడమే కాకుండా నాకు ఎంతో చేసిన మీకు ధన్యవాదాలు’’ - వరుణ్ తేజ్
‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. చూస్తే చూడాలి మెగాస్టార్ సినిమా చూడాలి అని చిన్నప్పుడు అనుకునే నేను.. ఇపుడు తీస్తే తీయాలిరా.. మెగాస్టార్‌తో సినిమా తీయాలి అనిపిస్తుంది. ఏం జన్మ సార్ మీది సూపర్’ - బండ్ల గణేష్
‘స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచిన మా చిరు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ - రోజా
‘‘మనల్ని నమ్మే వ్యక్తి, ఎప్పుడూ నేర్చకునే తత్వం, దాతృత్వం కలిగిన వ్యక్తి, కఠిన పరిస్థితుల్లో ఎంతో సామర్థ్యాన్ని కనబరిచే మనిషి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన వెంట ఉండే వ్యక్తి, అవసరానికి ఆదుకునే గొప్ప మనిషి - ఆయన్ని నేను మామయ్య అని పిలుస్తాను. ఈ ప్రపంచం మెగాస్టార్ అని పిలుస్తుంది’’ - ఉపాసన