జీవితానికి 85.. సిని జీవితానికి 50ఏళ్లు.. నేడు పి.సుశీల జన్మదినం..
1935 నవంబర్ 13న జన్మించిన పి. సుశీల..పెండ్యాల స్వరాల్లో తొలిసారి పల్లవించారు. తన గాత్రంతో వేలాది పాటలు పాడిన సుశీల ఐదుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. 2002లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2008లో 'పద్మభూషణ్' వంటి అత్యున్నత అవార్డులను అందుకున్నారు. మాతృభాష తెలుగులోనే కాకుండా పరభాషల్లోనూ సుశీల గానం జాతీయ పురస్కారాలను సంపాదించడం విశేషం. ముఖ్యంగా భక్తిగీతాల్లో సుశీల గళం సాగిన తీరు వల్ల ఎందరి హృదయాలో భక్తిమార్గం పట్టాయి... కొందరికి భక్తియోగం పట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పి.సుశీల (పులపాక సుశీల) గాయకురాలు. సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13 న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది.
తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలదు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు.