హెరాల్డ్ బర్త్‌డే : ఆయనో అద్భుతం.. సైకతంతో సందేశం...నేడు సుదర్శన్‌పట్నాయక్ జన్మదినం
సైకత శిల్పి విద్యను తన సృజనాత్మకత ను పయోగించి స్వయంగా నేర్చుకున్నారు. తన 7 సంవత్సరాల వయస్సు నుంచే సైకత శిల్పాలను చేయుట ప్రారంభించాడు. అతడు కొన్ని వందల సైకత శిల్పాలను సృష్టించారు. ప్రస్తుతం ప్రజలు ఈ సైకత శిల్ప కళకు ఆకర్షితులవుతున్నారు.పట్నాయక్ ఇప్పటి వరకూ భారత్ తరుపున అంతర్జాతీయస్థాయి పోటీల్లో 40 సార్లు పాల్గొన్నారు. పదిహేను ప్రథమ బహుమతులను గెలుచుకున్నారు. పట్నాయక్‌కు భార్య, ఒక పిల్లవాడు ఉన్నారు.లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు 2009లో ప్రకటించిన ఈ ఏటి మేటి వ్యక్తులలో అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, లతామంగేష్కర్ వంటి ప్రముఖుల పేర్ల సరసన పట్నాయక్ పేరుకూడా చేరింది.
అస్సాంలో ఆయనకు పెద్దఎత్తున అభిమానులున్నారు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఒక సామాజిక అంశాన్ని ప్రతిబింబించేలా శిల్పాన్ని నిర్మించి ప్రపంచ రికార్డు సృష్ట్టిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఒడిషా, అస్సాం రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల ఉమ్మడి నిర్వహణలో ప్రపంచ రికార్డును నెల కొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన సృజనాత్మక సైకత శిల్పాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నింటినో గెలుచుకున్నాడు. అతి పొడవైన "శాంతాకాస్" ఇసుకతో చేసి ప్రపంచ రికార్డును సాధించాడు.సుదర్శన్ పట్నాయక్ రష్యాలో జరిగిన మొదటి మాస్కో అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలో పాల్గొని "పీపుల్స్ చాయిస్" బహుమతిని పొందారు. ఆయన నేషనల్ అల్యూమినియం కంపెనీకు భారత దేశ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.