బర్త్ డే : బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన బాలీవుడ్ ఖిలాడీ
మొదట చెప్పుకోవాల్సిన చిత్రం 'గుడ్ న్యూవ్జ్'. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 205.14 కోట్ల వ్యాపారాన్ని చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసంజ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
"మిషన్ మంగళ్" - అక్షయ్ కుమార్ ప్రతి సంవత్సరం అనేక సినిమాలను విడుదల చేస్తారు. ఆయన నటించిన చిత్రం "మిషన్ మంగళ్"కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 202.98 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
అక్షయ్ కుమార్ చిత్రం "హౌస్‌ఫుల్ 4" 2019 లో విడుదలైంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపు 194.60 కోట్ల వ్యాపారం చేసిన ఈ సినిమా పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.
అక్షయ్ కుమార్ ప్రతిసారీ ఏదో ఒక కొత్త పాత్రలో నటించడానికి ఇష్టపడతాడు. అలాగే రజనీకాంత్ సూపర్ రోబోట్ మూవీ '2.0' లో విలన్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం భారతదేశంలోని అనేక భాషలలో విడుదలైంది. ఈ చిత్రం కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 189.55 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
2019 లో అక్షయ్ కుమార్ న నటించిన దేశభక్తి మూవీ 'కేసరి' చిత్రం విడుదలైంది, ఈ చిత్రంలోని పాటలు నార్త్ నుంచి సౌత్ దాకా అందరినీ తెగ అలరించాయి. ఈ చిత్రంలో మనం కేవలం 2100 మంది సిక్కు సైనికులు 10,000 ఆఫ్ఘన్లతో యుద్ధం చేయడం చూడొచ్చు. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 154.41 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.