బిజినెస్ మ్యాన్ నుంచి నటుడిగా శివ బాలాజీ ప్రయాణం

Vimalatha
వ్యాపారవేత్త నుంచి హీరోగా, హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన శివ బాలాజీ పుట్టిన రోజు నేడు. 1980 అక్టోబర్ 14న శివ బాలాజీ చెన్నైలో పుట్టాడు. ఆయన నటన మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా. శివబాలాజీ తండ్రి పేరు మనోహరం రామస్వామి. ఆయన వ్యాపారవేత్త, తల్లి శివకుమారి. శివబాలాజీకి తమ్ముళ్లు ప్రశాంత్ బాలాజీ, కృష్ణ సాయి, చెలెల్లు గాయత్రి ఉన్నారు. కార్తికేయన్ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్న బాలాజీ 17 ఏళ్ల వయసు నుంచే తమ కుటుంబ వ్యాపారాలను చూసుకునేవాడు. చిన్న వయసు నుంచే తన తండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడంతో మంచి అనుభవం వచ్చింది. దీంతో 20 ఏళ్ల వయసులోనే తన సొంత కంపెనీ స్థాపించాడు. తర్వాత ఆయన తండ్రి సినిమా లేదా వ్యాపారం ఏదో ఒక రంగాన్ని మాత్రమే ఎంచుకోమని సలహా ఇవ్వడంతో 22 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆయన తొలి చిత్రం ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. తర్వాత ఆయన ఎలా చెప్పను సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. దోస్త్ సినిమాలో హీరోగా నటించాడు. అల్లు అర్జున్ 'ఆర్య' సినిమాలో శివ బాలాజీ పోషించిన అజయ్ పాత్ర అందరికీ దగ్గర అయ్యింది. స్టార్ హోదాను తెచ్చి పెట్టింది ఆ పాత్ర. నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శివ బాలాజీ సంక్రాంతి సినిమాలో వెంకటేష్, శ్రీకాంత్ తమ్ముడి గా నటించాడు. కోకిల, చందమామ, శంభో శివ శంభో, జెండాపై కపిరాజు వంటి చిత్రాలలో నటించారు. 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. 2009 తన సహనటి మధుమితను వివాహం చేసుకున్నాడు. వారికి ధన్విన్, గగన్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇటీవల జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో శివ బాలాజీ కోశాధికారిగా ఎన్నికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: