ఆఖరకు విస్తారా ఎయిర్ లైన్స్ కూడా ఖర్చు తగ్గించుకోడానికి ఉద్యోగులను సెలవులపై !

Kaumudhi

క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల‌తో అనేక రంగాలు దెబ్బ‌తింటున్నాయి. ఆర్థికంగా తీవ్ర న‌ష్టాల‌న‌ను చ‌విచూస్తున్నాయి. న‌ష్టాల‌ను త‌గ్గించుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఖ‌ర్చులు త‌గ్గించుకునే దిశ‌గా క‌దులుతున్నాయి. ఇందుకోసం త‌మ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేక తొల‌గిస్తున్నాయి. దీంతో వేలాది మంది త‌మ ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు. ఇక మ‌రికొన్ని కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను సెల‌వుల‌పై ఇంటికి బ‌ల‌వంతంగా పంపిస్తున్నాయి. తాజాగా.. ఇదే దారిలో విస్తారా విమాయాన సంస్థ‌కు న‌డిచింది. సుమారు 12మంది సీనియ‌ర్ ఉద్యోగుల‌ను సెల‌వుల‌పై ఇంటికి పంపిస్తోంది.

 

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించ‌డంతో ఆ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రి సెల‌వులు ప్ర‌క‌టించింది. అయితే..ఇందులో మూడు రోజుల వేత‌నం కూడా ఇవ్వ‌డం లేదు. అయితే.. విస్తారా తీసుకున్న నిర్ణ‌యంతో దాదాపుగా 75శాతం సిబ్బందికి ఎలాంట ఇబ్బంది ఉండ‌ద‌ని సంస్థ ప్ర‌తినిధి పేర్కొన్నారు. అంటే సుమారు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ వంటి మిగిలిన 2,800 మంది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: