దారుణం: అమెరికాలో క‌రోనా కేసులు 7,09,201.. మరణాలు 37,135

Kaumudhi

అమెరికాలో క‌రోనా వైర‌స్ విధ్వంసం కొనసాగుతోంది. అగ్ర‌రాజ్యాన్ని దుఃఖసాగ‌రంలో ముంచింది. ఆ దేశ‌ప్ర‌జ‌ల‌కు ఓదార్పు వేద‌న‌ను మిగుల్చుతోంది. రోజుకు వంద‌లు, వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఎటుచూసినా క‌న్నీటిదార‌లే క‌నిపిస్తున్నాయి. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా గుండెల‌విసిపోయే గాథ‌లే వినిపిస్తున్నాయి. రోజురోజుకూ క‌రోనా  పాజిటివ్ కేసుల సంఖ్య ఊహ‌కంద‌ని విధంగా పెరిగిపోతోంది. మ‌ర‌ణాలు కూడా అదే స్థాయిలో సంభ‌విస్తున్నాయి. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ 709201కు చేరుకుంది. మరణాల సంఖ్య 37135. ఇప్ప‌టివ‌ర‌కు 59997 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

 

ప్ర‌ధానంగా న్యూయార్క్ న‌గ‌రంలో కొవిడ్‌-19కు హాట్‌స్పాట్‌గా మారింది. సగానికి కంటే ఎక్కువ కేసులు ఇక్క‌డే న‌మోదు అవుతున్నాయి.. స‌గానిక‌న్నా ఎక్కువ‌ మ‌ర‌ణాలు ఇక్క‌డే సంభ‌విస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 233951 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 17131 మంది మ‌ర‌ణించారు. సుమారు 192933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ త‌ర్వాత న్యూజెర్సీలో 78467 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ 3,840 మంది మ‌ర‌ణించారు. 73356యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ గ‌ణాంకాలే చెబుతున్నాయి.. అమెరికాలో ముందుముందు ప‌రిస్థితులు మ‌రెంత దారుణంగా మారబోతున్నాయో..!    

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: