త్రివిక్రమ్‌ను ఇరికించిన రామ్‌చరణ్... !
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ చాలా కఠినంగా అమలు అవుతోంది. దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు ఎలా పెరిగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక అటు షూటింగ్‌లు బంద్ కావడంతో పాటు ఇటు థియేటర్లు మూతపడడంతో సెలబ్రిటీలు ఇళ్లల్లోనే ఉంటూ రకరకాల వీడియోలతో తమ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇక తాజాగా సందీప్‌రెడ్డి వంగ ఇంటి పని చేసిన వీడియో తీసి రాజమౌళికి సవాల్ విసిరారు. ఇక రాజమౌళి నిన్న తన ఇంటి పనులు తానే చేసుకున్న వీడియో పోస్ట్ చేసి రామ్‌చరణ్‌కు సవాల్ విసిరారు.
ఇక రాజమౌళి సవాల్‌ను స్వీకరించిన రామ్ చరణ్ ఈ రోజు ఆ ఛాలెంజ్ పూర్తి చేశాడు. 39 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో రామ్‌చరణ్ తన బట్టలు తానే ఉతుక్కోవడంతో పాటు ఇంట్లో తడి క్లాత్ పెట్టి క్లీన్ చేశారు. ఇక కుండీల్లో మొక్కలకు నీళ్లు పోసిన చరణ్, వంటింట్లో కాపీ పెట్టి తీసుకు వెళ్లి తన భార్య ఉపాసనకు ఇచ్చాడు. అనంతరం ఈ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీ ఛాలెంజ్ పూర్తయ్యింది రాజమౌళి గారు... ఇంట్లో పనులను చేయడంలో గర్వపడదాం! నిజమైన పురుషులుగా ఉండి, పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేద్దాం అని మెసేజ్ చేయడంతో పాటు తాను ఈ ఛాలెంజ్‌ను త్రివిక్రమ్‌కు నామినేట్ చేస్తున్నట్టు చెప్పి మొత్తాన్ని త్రివిక్రమ్‌కు విసిరాడు.
Done @ssrajamouli garu !!
Let's take pride in doing chores at home! Let's be real men and help the women by sharing the work load.#BetheREALMAN
I further nominate Trivikram garu, @RanveerOfficial, @RanaDaggubati and @ImSharwanand to take up the challenge. pic.twitter.com/ItQ0zNQOR8 — Ram Charan (@AlwaysRamCharan) April 21, 2020