నాకు ఇష్టమైన ఆ పని చేయలేకపోయా : రతన్ టాటా పశ్చాత్తాపం
జీవితంలో ఎంత గొప్ప పొజీషన్లోకి వచ్చినా.. ఎంత గొప్ప మనుషులైనా వారికి ఇష్టమైన విషయంలో కాంప్రమైజ్ అవుతుంటారు. ఆ తర్వాత తాము ఆ పని చేయకలేకపోయామే అని బాధపడటం.. పశ్చాతప పడటం జరుగుతుంది. తాజాగా తన జీవితంలో ఎంతో ఇష్టమైన ఆర్కిటెక్ట్‌గా ఎంతోకాలం ప్రాక్టీస్ చేయలేకపోయానని రతన్ టాటా పశ్చాత్తాపం చెందారు. ఆర్కిటెక్ట్ రంగం అంటే ఎంతో ఇష్టం ఉండేదని.. ఆ రంగం తనను ఎంతో ప్రభావితం చేసిందని అన్నారు.
అయితే తన తండ్రి కోరిక మేరకు రెండేండ్లు ఇంజినీరింగ్ చదివానని, ఆ తర్వాత కుటుంబ వ్యాపారాల్లో మునిగిపోయానని చెప్పారు. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ ‘ఫ్యూచర్ ఆఫ్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్'పై కార్ప్‌గిని నిర్వహించిన ఆన్‌లైన్ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మనసులో ఉన్న మాటలు వెలుబుచ్చారు. 1959లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ డిగ్రీని పొందానని తెలిపారు.
ఆ సమయంలో లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆర్కిటెక్ట్ ఓ ఆఫీస్ లో వర్క్ కూడా చేశానని అన్నారు. వాస్తవానికి తాను ఎప్పుడూ ఓ ఆర్కిటెక్ట్‌గానే ఉండిపోవాలని అనుకోలేదని, అయితే ఇష్టపడి చదివి దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేకపోయానన్న బాధే ఉందన్నారు. తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని వదిలేశాననిన అన్నారు. కానీ తాను ఆర్కిటెక్ట్‌గా ఎంతోకాలం ప్రాక్టీస్ అప్పుడప్పుడు బాధపడుతుంటానని అన్నారు.