అందరిని ఆకర్షిస్తున్న ఐసీసీ ట్విట్.. ఏంటో మీరే చూడండి..?
ఐసీసీ అప్పుడప్పుడు పలు ఆసక్తికర పోస్టులు పెట్టి అభిమానులకు ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని క్రికెట్ దిగ్గజాల కు సంబంధించిన పలు ఆసక్తికర ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఐసిసి ఎప్పుడు అభిమానుల అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఐసీసీ మరొక దిగ్గజ క్రికెటర్ ఫోటో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో ఒక దిగ్గజ క్రికెటర్ గురించి వివరిస్తూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది ఐసిసి. 1666 వికెట్లు, 70, 485 డెలివరీలు, 55 వికెట్ హాల్స్.. అంతేకాకుండా 3 ప్రపంచ ప్రపంచకప్ టైటిళ్లు ... ఇవన్నీ ఒకే ఫొటోలో కనిపిస్తున్నాయి అంటూ ఆశ్చర్యపోతున్నట్లుగా ఒక ఎమోజి పెట్టి దిగ్గజ క్రికెటర్ ఫోటోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అటు నెటిజన్లు కూడా దీని పై ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
1️⃣,6️⃣6️⃣6️⃣ wickets
7️⃣0️⃣,4️⃣8️⃣5️⃣ deliveries
5️⃣5️⃣ five-wicket hauls 🏆
and THREE @cricketworldcup titles
... in one pic 🤯 pic.twitter.com/D1gmWm8gIx — ICC (@ICC) April 22, 2020