బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన కొరటాల... ఎవరిని నామినేట్ చేశాడంటే...!

Reddy P Rajasekhar

యువ దర్శకుడు సందీప్ వంగా ప్రారంభించిన బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ అక్కడి నుండి వరుసగా సినీ ప్రముఖులకు చేరుకుంది. దర్శకధీరుడు రాజమౌళి సందీప్ ఛాలెంజ్ ను పూర్తి చేసి జూనియర్, చరణ్ లను నామినేట్ చేశారు. ఛాలెంజ్ ను స్వీకరించిన జూనియర్ ఎన్టీయార్ వెంటనే పూర్తి చేసి దర్శకుడు కొరటాల శివకు ఛాలెంజ్ విసిరారు. కొద్దిసేపటి క్రితం కొరటాల ఛాలెంజ్ ను పూర్తి చేసి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కొరటాల శివ తన ఇంట్లో అంట్లు తోముతూ... డైనింగ్ టేబుల్ తుడుస్తూ... ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. అనంతరం విజయ్ దేవరకొండను బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. మరి విజయ్ ఈ ఛాలెంజ్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన పురుషులు మహిళలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఈ ఛాలెంజ్ ప్రారంభమైంది. 
 
లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఛాలెంజ్ ను పూర్తి చేసి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మరికొంతమందిని నామినేట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: