ముగిసిన కేంద్ర కేబినేట్ సమావేశం... ఆ రెండింటికి సడలింపులు ఇచ్చిన కేంద్రం...?

Reddy P Rajasekhar

 
కొద్దిసేపటి క్రితం కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో మే 3 తర్వాత లాక్ డౌన్ సడలింపు గురించి ప్రధానంగా చర్చ జరిగింది. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ర్యాపిడ్ కిట్ల అంశం గురించి కూడా కేబినెత్ చర్చించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నుంచి కేంద్రం రెండు వస్తువుల విక్రయానికి మినహాయింపు ఇచ్చింది. 
 
విద్యార్థుల పుస్తకాలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల కొనుగోలుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే కేంద్రం వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల విక్రయానికి కేంద్రం లాక్ డౌన్ ను మినహాయించిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలపై దాడులు అవమానకరం అని చెప్పారు. ఇకపై వారిపై దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు. దాడులను అరికట్టేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురాబోనున్నామని చెప్పారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: