ఈ అందాల చిన్నది ఏ స్టార్ హీరో కూతురు తెలుసా....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా ఖాతాలలో తమ ఫోటోలను షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ప్రతిరోజూ కొత్త ఫోటోలను షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గర అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత సంజయ్ దత్ కూతురు త్రిశాల తన ఫోటోలను, తల్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 
 
నిజానికి త్రిశాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈమె సంజయ్ దత్ పెద్ద భార్య కూతురు. సంజయ్ దత్ కూతురైన ఈ అందాల చిన్నది తనకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని చెబుతూ ఉండటం గమనార్హం. బాలీవుడ్ మీడియాలో త్రిశాల, సంజయ్ దత్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయని వార్తలు వచ్చాయి. త్రిశాల దత్ ఈ వార్తల గురించి స్పందిస్తూ తనకూ, తన తండ్రికి సంబంధాలు బాగున్నాయని .... సంజయ్ దత్ సెన్సాఫ్ హ్యూమర్ తో ఎంతో నవ్విస్తాడని తెలిపింది. 
 
తనకు అందరితో ప్రేమగా వ్యవహరించడం, దయ చూపడం వంటి లక్షణాలు తల్లి నుంచి వచ్చాయని... తండ్రిలాగే టెంపర్ ఎక్కువని, తొందరగా సహనం కోల్పోతానని తెలిపింది. ఈమె అమెరికాలోని హోఫ్ స్ట్రా యూనివర్సిటీ నుంచి సైకాలజీలో మాస్టర్స్ పట్టా పొందింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: