టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

Reddy P Rajasekhar

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు, కొత్త తరం హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి స్టార్ హీరోయిన్లే కాదు నాలుగు దశాబ్దాల క్రితం కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నవారు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేశారు. అలా గ్లామర్ పాత్రలతో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించి అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్లలో లక్ష్మి ఒకరు. 
 
15 ఏళ్ల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేసిన ఈమె 1970వ దశకంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది భాషలన్నింటిలోను నటించి విజయాలు అందుకున్నారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తూ సినిమా రంగంలో కొనసాగుతున్నారు. జీన్స్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కు బామ్మగా నటించిన లక్ష్మి 2019లో ఓ బేబీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి సక్సెస్ అందుకున్నారు. 
 
తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా 47 ఏళ్ల క్రితం జీవన తరంగాలు సినిమాలో నటించిన లక్ష్మి ఫోటోను, ఓ బేబీ సినిమాలో లక్ష్మి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: