తెలంగాణలో కరోనా విజృంభణ... కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదు...!

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈరోజు నమోదైన కేసుల్లో 13 కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 970కు చేరింది. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 262 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఒక్కరోజే రాష్ట్రంలో 58 మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా భారీన పడి 25 మంత్రి మృతి చెందారు. రాష్ట్రంలో హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉండటంతో గత రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 
 
మరో రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మే నెల 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: