బొట‌న వేలితో క‌రోనా ప‌సిగట్టొచ్చిలా...!

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి సంగతి తెలిసిందే. కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోన్న ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా నిర్ధారణ అవుతోంది. ఇప్పటివరకు వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపిన ఈ వైరస్ చిన్నపిల్లలపై కూడా పంజా విసురుతోంది. అయితే అమెరికా, యూరప్ దేశాలలోని డాక్టర్లు పిల్లల కాలి బొటనవేళ్లను పరీక్షించి కరోనాను నిర్ధారిస్తున్నారు. వైద్యులు మాట్లాడుతూ కరోనా సోకిన చిన్నారుల్లో బొటనవేళ్లలో వాపులు రావడం తాము గుర్తించామని చెబుతున్నారు. 
 
బొటనవేలిని పరీక్షించడం ద్వారా పిల్లల్లో కరోనా సోకిందో లేదో నిర్ధారించవచ్చని చెబుతున్నారు. అమెరికన్‌ అకాడమీ డెర్మటాలజీ డాక్టర్ల అసోసియేషన్‌ కూడా పిల్లల్లో బొటనవేలిని పరీక్షించి కరోనాను నిర్ధారించవచ్చని చెబుతోంది. మరోవైపు న్యూయార్క్ వైద్యులు కరోనా రోగుల్లో రక్తం గడ్డ కడుతున్నట్ట్లు గురించామని... రక్తం గడ్డ కట్టడం వల్ల అధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: