పుత్రుడిపై అపారప్రేమ... సచిన్‌కు తల్లి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా...!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈ రోజు 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారతదేశానికి తన ఆట ద్వారా ఎన్నో అరుదైన విజయాలు అందించిన ఘనత సచిన్ సొంతం. మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించిన సచిన్ జట్టులో ఉన్నప్పుడే 2011లో 25 ఏళ్ల తర్వాత మన దేశం ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ గెలుచుకుంది. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న సచిన్‌కు దేశ, విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెపుతున్నారు.
ఈ క్రమంలోనే సచిన్‌కు తల్లి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సచిన్ తన ట్విట్టర్ అక్కౌంట్లో నా తల్లి నుండి ఆశీర్వాదం తీసుకొని నా రోజును ప్రారంభించాను. ఆమె నాకు బహుమతిగా ఇచ్చిన గణపతి బప్పా ఫోటోను మీతో పంచుకోవడం ఖచ్చితంగా అమూల్యమైనది అని సచిన్ పేర్కొన్నాడు.
Started my day by taking blessings from my Mother. 🙏🏼Sharing a photo of Ganpati Bappa that she gifted me.
Absolutely priceless. pic.twitter.com/3hybOR2w4d — sachin tendulkar (@sachin_rt) April 24, 2020