కరోనాకి కొత్త లక్షణాలు... షాక్ అవుతున్న వైద్యులు....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు దేశంలో 24942 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5210 మంది డిశ్చార్జ్ కాగా 779 మంది మృతి చెందారు. అయితే వైద్యులు కరోనా రోగులకు చికిత్సనందించే సమయంలో వారిలో కొత్త లక్షణాలను గుర్తిస్తున్నారు. 
 
వైద్యుల పరిశోధనల్లో కరోనాకు సంబంధించిన కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ కు చైనా వైద్యులే పూర్తి లక్షణాలను కనిపెట్టలేకపోయారు. తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు సాధారణంగా కరోనా సోకిన వారికి ఉండే లక్షణాలు. కానీ ఈ మధ్య కాలంలో వైద్యులు జరుపుతున్న పరిశోధనల్లో పిల్లల్లో బొటలివేలిని పరిశీలించి కరోనాను నిర్ధారించవచ్చని తేలింది. 
 
కరోనా సోకిన వారిలో దాదాపు 20 శాతం మందిలో దద్దుర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా రోగుల్లో ఎర్రటి దద్దుర్లు ఉన్నట్లు గుర్తించారు. చేతులపై, కాలిపై, బ్రొటనవేలిపై ఎక్కువగా దద్దుర్లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: