కరోనా తిరగబెట్టదని గ్యారంటీ లేదు... ప్రపంచ దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో...?
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలను కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌వో మరోసారి హెచ్చరించింది. ఒకసారి కరోనా భారీన పడిన వారికి మరలా కరోనా సోకే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. తక్కువ కేసులు నమోదవుతున్నాయని కొన్ని దేశాలు లాక్ డౌన్ లో సడలింపులు చేసి కోలుకున్న వారికి ఇమ్యూనిటీ పాస్‌పోర్టులను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాయి.
శరీరంలో కరోనాను నిరోధించే యాంటీ బాడీలు ఉన్నవారికి పాస్‌పోర్టులను ఇవ్వాలని పలు దేశాలు భావిస్తున్నాయి. ఎవరైతే ఈ సర్టిఫికెట్లు కలిగి ఉంటారో వారు దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది. పలు దేశాలు ఈ సర్టిఫికేట్లను కోలుకున్న రోగులకు అందజేస్తున్నట్లు వార్తలు రావడంతో డబ్ల్యూహెచ్‌వో ఒకే వ్యక్తికి రెండు సార్లు కరోనా సోకవచ్చని.... అలా సోకదు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.
సామాజిక దూరం పాటించకపోయినా, మాస్కులు ధరించకపోయినా వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. వైరస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.