కపిల్‌దేవ్ కొత్త లుక్ వెనక ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్య సరికొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. బట్టతల, గెడ్డంతో ఉన్న లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది అచ్చ బాహుబలి చిత్రంలోని కట్టప్పలా ఉన్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. నయా కట్టప్ప అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. అయితే.. ఈ లుక్ వెనుక ఉన్న రహస్యాన్ని కపిల్‌దేవ్ వెల్లడించారు. వెస్టిండీస్ గొప్ప క్రికెటర్ వివ్ రిచర్డ్స్, 2011లో భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఎంఎస్ ధోని ప్రేరణతోనే ఈ సరికొత్త లుక్‌లో కనిపించానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మరికొన్ని విషయాలను పంచుకున్నారు.
*నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సర్ వివియన్ రిచర్డ్స్‌ను చూశాను. అతను నా హీరో కాబట్టి .. నేను కూడా అలా ఎందుకు ఉండకూడదు అని అనుకున్నా. ధోని కూడా నా హీరోనే.. అతను ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జుట్టు కత్తిరించాడు. ఇప్పుడు నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కూడా అలాగే చేశాను* అని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసిన వీడియోలో కపిల్‌దేవ్ తెలిపారు. దీనిపై వివ్ రిచర్డ్స్ కూడా స్పందించారు.. *హహాహా మీరు నా స్నేహితుడు. సరైన ప్రేరణ పొందారు* అంటూ ట్వీట్ చేశారు. కాగా, రిచర్డ్స్, కపిల్‌దేవ్ అనేక మ్యాచ్‌ల్లో తలపడిన విషయం తెలిసిందే.
Thalaivar @therealkapildev follows Sir @ivivianrichards' beardo and #Thala @msdhoni's hairdo! #WhistlePodu VC: @vikrantgupta73 🦁💛 pic.twitter.com/XxzH7FWBt5 — chennai Super Kings (@ChennaiIPL) April 25, 2020