హార్ట్ బ్రేకింగ్ వీడియో : కరోనా పై పోరాటం చేస్తున్న నర్స్ ఏడుస్తూ..?
కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అయితే తాజాగా ఓ నర్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హృదయ విదారకమైన ఈ వీడియోలో కరోనా వైరస్ సంక్షోభానికి సహాయపడడానికి న్యూయార్క్ నగరానికి తాను వచ్చినట్లు నివేదించింది సదరు నర్సు . కాగా ప్రస్తుతం ఆ నర్సు ఏడుస్తూ చేసిన ఈ వీడియో అందరి హృదయాలను కదిలించేలా ఉంది. డేనియల్ స్మాల్ అనే నర్సు ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక వీడియో ని షేర్ చేసింది. అయితే కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నానని.. ఎంతో మంది చనిపోతు ఉండడం చూసి అలసి పోయాను ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కరోనా తో చనిపోయినవారిని కుటుంబీకులకు ఈ విచారకరమైన వార్తలు చెప్పి ఆమె విసిగిపోయినట్లు విడియాలో తెలిపింది . అయితే ఈ కీలకమైన సమయంలో ఒకరి పై ఒకరు కనికరం ప్రేమ కలిగి ఉండాలంటే ఆవేదన వ్యక్తం చేసింది నర్సు. ఈ నర్సు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.