ఏపిలో 80 శాతం మండలాల్లో కరోనా లేదు : సీఎం జగన్

praveen

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న   విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కూడా కరోనా ను కట్టడికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ  సర్వశక్తులు ఒడ్డుతుంది . ఇక తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలోని కరోనా  వైరస్ కు సంబంధించి పలు వివరాలు ప్రజలకు వెల్లడించారు.

 

 

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని... కచ్చితంగా రాష్ట్రంలో కరోనా ను కట్టడి  చేసి తీరుతామని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో ఇప్పటివరకు కరోనా వైరస్ జాడలేదు అంటూ తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ ధైర్యం నింపారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో  ఇప్పటివరకు కరోనా అడుగు పెట్టలేదని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి కరోనా  వైరస్ కు  దూరంగా ఉండాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: