పోకిరీకి 14 సంవత్సరాలు.. అక్కినేని ఫాన్స్ ఏమన్నారంటే..?
పూరి జగన్నాథ్ మహేష్ కాంబినేషన్ లో దాదాపు 14 సంవత్సరాల క్రితం వచ్చిన పోకిరి సినిమా తెలుగు ఇండస్ట్రీ లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో చెప్పాల్సిన పనిలేదు. మహేష్ ను ఒక్కసారిగా స్టార్ హీరోని చేసింది పోకిరి . తెలుగులో 2006లో ఏప్రిల్ 28వ తేదీ అంటే సరిగ్గా ఈ రోజున పోకిరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మాస్ ప్రేక్షకులను క్లాస్ ప్రేక్షకులను అలరించి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది పోకిరి సినిమా. సినిమా 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా దర్శకుడు పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కి పోకిరి సినిమా చిత్రబృందం మొత్తానికి 14
సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు కూడా ఇలాంటి సినిమాలు ఉండాలి అంటూ విష్ చేసారు.