ఇర్ఫాన్‌ఖాన్ మృతిపై సచిన్ హార్ట్ టచ్చింగ్ ట్వీట్... వీరాభిమానిని అంటూ...!
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఆయన నటన అసామాన్యంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇర్ఫాన్ మృతిపై పలువురు బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక ఇర్ఫాన్ కన్నుమూసిన వార్త వినడానికే విచారంగా ఉందని భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చెప్పారు.
సచిన్ తన ట్విట్టర్లో ఇర్పాన్ ఖాన్‌కు నివాళులు అర్పించారు. నాకు ఇష్టమైన నటుల్లో ఇర్ఫాన్ ఒకరు అని చెప్పిన సచిన్... అతడు నటించిన అన్ని సినిమాలు చూశానని.. ఆ సినిమాల్లో ఇర్ఫాన్ నటన అద్భతమని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. అతడి చివరి సినిమా కూడా చూశానన్న సచిన్.. నటన అనేది అతడికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది.. అద్భతమైన నటుడిని కోల్పోవడం బాధకరమని సచిన్ పేర్కొన్నాడు. చివరిగా ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలని సచిన్ పేర్కొన్నాడు.