ఇర్ఫాన్ మృతిపై స్మృతీ ఇరానీ సంతాపం... ప్రతి పాత్రతో చెరిగిపోలేని ముద్ర వేశారంటూ వ్యాఖ్యలు..?

Reddy P Rajasekhar

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న ఇర్ఫాన్ చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ మృతిపై సంతాపం తెలిపారు. 
 
స్మృతీ ఇరానీ తన ట్వీట్లో ఇర్ఫాన్ ప్రతి పాత్రతో చెరిగిపోలేని ముద్ర వేశాడని అన్నారు. తన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందినా ఆయన చేసిన ఎన్నో పాత్రల్లో జీవించే ఉన్నాడని చెప్పారు. ఇర్ఫాన్ ఖాన్ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన హాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. 
 
2006 సంవత్సరం మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన సైనికుడు సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఈ పాత్ర అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: