ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రిషి కపూర్ మృతి... శోకసంద్రంలో అభిమానులు...!

Reddy P Rajasekhar

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఈరోజు ఉదయం ముంబాయిలో హెచ్.ఎన్.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ యువ హీరో రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. 
 
రెండేళ్ల క్రితం రిషి కపూర్ కు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ యింది. న్యూయార్క్ నగరంలో కొంతకాలం పాటు చికిత్స తీసుకున్న రిషి కపూర్ కొంతకాలం తరువాత క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. ఇటీవల ముల్క్ , ది బాడీ సినిమాలలో నటించి మెప్పించిన రిషి కపూర్ తాజాగా ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఆయన మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: