సౌత్‌లో క‌మల్‌... నార్త్‌లో రిషీ క‌పూరే.. ఈ క్రెడిట్ ఆ ఇద్ద‌రిదే...!

Reddy P Rajasekhar

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఈరోజు ఉదయం ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణవార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1973లో తొలిసారిగా రిషీ కపూర్ బాబీ చిత్రంలో నటించారు. 51 చిత్రాల్లో కథానాయకుడిగా, 41 చిత్రాల్లో మల్టీస్టారర్ కథానాయకుడిగా నటించి అభిమానులను మెప్పించారు. రిషీ కపూర్ కు డైరెక్టర్ల యాక్టర్ గా బాలీవుడ్ లో గుర్తింపు ఉంది. 
 
సౌత్ ఇండియాలో కమల్ హాసన్ దర్శకునికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి డైరెక్టర్ల యాక్టర్ గా ఎలా గుర్తింపు పొందారో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రిషీ కపూర్ అలాంటి గుర్తింపునే సొంతం చేసుకున్నారు. గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ లో కమల్ హాసన్, నార్త్ లో రిషీ కపూర్ డైరెక్టర్ల యాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. రిషీ కపూర్ మృతితో బాలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 
 
రిషీ కపూర్ మరణవార్త తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు మృతి పట్ల సంతాపం తెలిపారు. అమితాబ్ బచ్చన్ తాను మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: